కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..! 1 m ago
ఏపీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త చెప్పింది. కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. డిసెంబర్ చివరి వారంలో ఫిజికల్ టెస్ట్ నిర్వహించనుంది. 2022లో 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. గతేడాది జనవరిలో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. ప్రిలిమినరీ పరీక్ష తర్వాత పలు కారణాలతో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియ నిలిపివేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 11 నుంచి 21 వరకు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.